తెలంగాణ

telangana

ETV Bharat / international

Biden Afghanistan: 'అఫ్గాన్​ నుంచి పౌరుల తరలింపు కష్టం.. కానీ' - అమెరికా వాసుల తరలింపుపై జో బైడెన్​

అఫ్గాన్​లో చిక్కుకున్న అమెరికన్లను తమ స్వస్థలాలకు చేరుస్తానని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ (Biden Afghanistan) హామీ ఇచ్చారు. కాబుల్​ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం కలగకుండా తాము భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. పౌరులను తరలించటం చాలా క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొన్నారు.

joe biden, america president
జో బైడెన్​

By

Published : Aug 21, 2021, 12:09 AM IST

Updated : Aug 21, 2021, 10:35 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దురాక్రమణ తర్వాత.. అమెరికా వాసులను వెనక్కు రప్పించడంలో విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden Afghanistan)​ శుక్రవారం స్పందించారు. అఫ్గాన్​లో చిక్కుకున్న అమెరికావాసులను కచ్చితంగా తమ స్వస్థలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు. కాబుల్​ విమానాశ్రయంలో విమానసేవలకు అంతరాయం కలగకుండా తాము భద్రతా చర్యలు చేపట్టామని బైడెన్​ తెలిపారు. సైనిక విమానాలే కాకుండా, పౌరుల చార్టర్లు, ఇతర దేశాల విమానాల రాకపోకలకు కూడా రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. నిస్సహాయులైన అఫ్గాన్​ పౌరులను తమతో పాటు తీసుకువచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

క్లిష్టమైన ప్రక్రియ..

అఫ్గాన్‌లో అమెరికా పౌరల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు బైడెన్​. అఫ్గాన్‌(Biden Afghanistan) నుంచి పౌరులను తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు.

" అఫ్గాన్‌ నుంచి వాయు మార్గంలో తరలింపు అతి క్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుంది. అఫ్గాన్‌లో చాలా కఠినమైన పరిస్థితుల్లో మా బలగాలు పనిచేస్తున్నాయి. కాబూల్‌ విమానాశ్రయంలో మా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంది. విమానాశ్రయం వద్ద 6 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మిలటరీ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్‌ ఫ్లైట్లు ఉన్నాయి. పౌరులను తరలించేందుకు ఈ విమానాలు ఉపయోగపడతాయి. జులై నుంచి ఇప్పటికే 18 వేల మందిని తరలించాం. ఆగస్టు 14 నుంచి సైనిక విమానాల్లో 13 వేల మందిని తరలించాం"

- జో బైడెన్‌, అమెరికా అధ్యక్షుడు

కాబుల్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రక్రియలో జాప్యం జరుగుతున్న క్రమంలో.. అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు. కాబుల్‌ నుంచి అమెరికన్లందర్నీ క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని అభయమిచ్చారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన శ్వేతసౌధం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘కాబుల్‌లో కనిపిస్తున్న దృశ్యాలను చూడాలని ఎవరూ అనుకోరు. మానవమాత్రులెవరూ వాటిని జీర్ణించుకోలేరు. అక్కడి విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న వారిని తీసుకొస్తాం’’ అని అన్నారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.

ఇదీ చూడండి:Afghan Crisis: అమెరికా ఖర్చు ఘనం- ఫలితం మాత్రం...

Last Updated : Aug 21, 2021, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details