తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్​, పెన్స్​కు త్వరలో కరోనా టీకా! - Biden latest news

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్​ త్వరలో టీకా వేయించుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ బహిరంగంగా టీకా తీసుకోనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

Biden, Pence set to get COVID-19 vaccine soon
బైడెన్​, పెన్స్​లకు త్వరలో కరోనా టీకా!

By

Published : Dec 17, 2020, 12:09 PM IST

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ త్వరలో వ్యాక్సిన్​ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ విషయంతో సంబంధం ఉన్న ఒకరు తెలిపారు. రానున్న కొన్ని వారాల్లో బైడెన్​ బహిరంగంగా టీకా వేయించుకుంటారని పేర్కొన్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​, ఆయన సతీమణి కారెన్​.. శుక్రవారం బహిరంగంగా వ్యాక్సిన్ వేయించుకోనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.

బైడెన్​ సహా కమలా హారిస్​, ట్రంప్​,పెన్స్​కు వీలైనంత త్వరలో వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సలహా ఇచ్చారు. దీనిపై స్పందించిన బైడెన్​.. కరోనాతో పోరాడుతున్న వైద్య సిబ్బందికి, వైరస్​తో ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అయితే అమెరికా ప్రజల్లో టీకాపై విశ్వాసాన్ని నింపడానికి బహిరంగంగా టీకా వేయించుకుంటానని బైడెన్​ గతంలో అన్నారు.

ఇదీ చూడండి:'బైడెన్​, ట్రంప్​లకు కరోనా టీకా ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details