తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల రేసులో జో బిడెన్ జోరు - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

డెమొక్రాట్​ ఆశావహ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్​ ఎన్నికల కోసం విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. 24 గంటల్లోనే 6.3 మిలియన్ డాలర్ల చందాలు రాబట్టి... సొంత పార్టీలోని ప్రత్యర్థుల కంటే ముందున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మూడోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు.

అధ్యక్ష ఎన్నికల రేసులో జో బిడెన్ జోరు

By

Published : Apr 27, 2019, 1:38 PM IST

Updated : Apr 27, 2019, 2:27 PM IST

అధ్యక్ష ఎన్నికల రేసులో జో బిడెన్ జోరు

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రాట్​ ఆశావహ అభ్యర్థి జో బిడెన్​ కేవలం 24 గంటల్లో 6.3 మిలియన్​ డాలర్ల ఎన్నికల విరాళాలు సేకరించారు. మిగతా పోటీదారుల కంటే ముందంజలో ఉన్నారు.

ఆన్​లైన్​ ద్వారా బిడెన్​కు ఒక్కొక్కరి నుంచి సగటున 41 డాలర్ల విరాళం అందింది. ఈసారి ఆయనకు విరాళాలు ఇచ్చినవారిలో సుమారు 61 శాతం మంది కొత్తవారు. గత ఎన్నికల్లో జో బిడెన్​ పోటీ చేసినప్పుడు వీరెవరూ ఆయనకు ప్రచార ఖర్చుల కోసం చందా ఇవ్వలేదు.

టెక్సాస్​కు చెందిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు, డెమొక్రాట్ ఆశావహ​ అధ్యక్ష అభ్యర్థి బెటో ఓరూర్కే 24 గంటల్లో 6.1 మిలియన్​ డాలర్ల విరాళాలు సేకరించారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వెర్మోంట్​ సెనెటర్​ బెర్నీ సాండర్స్​కు వచ్చిన చందాల విలువ 5.9 మిలియన్ డాలర్లు.

అశావహ అభ్యర్థులందరూ ఇప్పటి నుంచి ఓ సంవత్సరం పాటు ప్రాథమిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వారిలో ఒకరు అధికారికంగా పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవుతారు. ఆ వ్యక్తి 2020 నవంబర్​లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో తలపడతారు.

ఇదీ చూడండి :ట్రంప్​పై 'ఫోన్'​ దాడికి యత్నం.. కొద్దిలో మిస్​

Last Updated : Apr 27, 2019, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details