తెలంగాణ

telangana

ETV Bharat / international

రీమా, నేహాకు శ్వేతసౌధంలో కీలక పదవులు - etv bharat telugu news

అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో ఇద్దరు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు. రీమా షాను వైట్​హౌస్ కౌన్సెల్ కార్యాలయానికి డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్​గా, నేహా గుప్తాను అసోసియేట్ కౌన్సెల్​గా బైడెన్ ఎంపిక చేశారు.

Biden names two Indian Americans to the Office of White House Counsel
ఇద్దరు ఇండో అమెరికన్లకు కీలక పదవులు

By

Published : Jan 12, 2021, 1:07 PM IST

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు ఇండో అమెరికన్లకు చోటు లభించింది. భారత సంతతికి చెందిన రీమా షా, నేహా గుప్తాను శ్వేతసౌధ న్యాయ నిపుణుల బృందానికి ఎంపిక చేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. రీమాను వైట్​హౌస్ కౌన్సెల్ కార్యాలయంలో డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్​గా నియమించారు. నేహా గుప్తాను అసోసియేట్ కౌన్సెల్​గా ఎంపిక చేశారు.

న్యాయ శాఖలోని సొలిసిటర్ జనరల్ కార్యాలయంలో అసోసియేట్​గా పనిచేశారు రీమా షా. అమెరికా సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఎలీనా కగన్​తో పాటు, డీసీ సర్క్యూట్​కు చెందిన అప్పీల్ కోర్టులో జడ్జి శ్రీ శ్రీనివాసన్​కు క్లర్క్​గా సేవలందించారు. న్యూజెర్సీకి చెందిన రీమా షా.. హార్వర్డ్ కాలేజీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, యేల్ లా స్కూల్​లో విద్యనభ్యసించారు. బైడెన్-హారిస్ ప్రచార కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. బైడెన్ డిబేట్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అమెరికాకు వలస వెళ్లిన భారతీయులకు నేహా గుప్తా జన్మించారు. ప్రస్తుతం న్యూయార్క్​లో నివసిస్తున్నారు. హార్వర్డ్ కాలేజీ, స్టాన్​ఫోర్డ్ లా స్కూల్​ నుంచి పట్టా అందుకున్నారు. శాన్​ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ కార్యాలయంలో డిప్యూటీ సిటీ అటార్నీగా పనిచేశారు. తొమ్మిదో సర్క్యూట్ యూఎస్ అప్పీల్స్ కోర్టులో న్యాయమూర్తి మైఖెల్ డేలీ హావ్​కిన్స్​తో పాటు కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టు జడ్జి రిచర్డ్ సీబర్గ్​కు క్లర్క్​గా వ్యవహరించారు.

ABOUT THE AUTHOR

...view details