తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోరంగా పడిపోయిన బైడెన్​ గ్రాఫ్​.. కారణమేంటి? - జో బైడెన్​

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది కాలంలోనే జో బైడెన్​పై(joe biden news today ) ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. గడిచిన రెండు నెలల్లో ఆయన గ్రాఫ్​ ఘోరంగా పడిపోయింది. ప్యూ పరిశోధన కేంద్ర విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం(pew research center report).. బైడన్​ పాలనకు 44 శాతం మాత్రమే మద్దతు పలికారు.

Biden loses ground
జో బైడెన్

By

Published : Sep 26, 2021, 1:59 PM IST

డొనాల్డ్​ ట్రంప్​పై ఘన విజయం సాధించి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్​కు(joe biden news today ).. అనతికాలంలోనే ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోంది. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఆయన ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆయన పాలనపై ప్రజలకు నమ్మకం పోతోందని ప్యూ​ పరిశోధన కేంద్రం తెలిపింది. గడిచిన రెండు నెలల్లో బైడెన్​కు ప్రజాదరణ భారీగా తగ్గినట్లు పేర్కొంది. అధ్యక్షుడిగా బైడెన్​(biden news) సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారని 44 మంది చెప్పగా.. 53 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్యూ పరిశోధన కేంద్రం నివేదిక తాజా గణాంకాల(pew research center report) ప్రకారం.. జులై తర్వాత బైడెన్​ రేటింగ్​ భారీగా పడిపోయింది. జులై నెలలో 55 శాతం మంది బైడెన్​ పాలనకు మద్దతు పలకగా.. 43 శాతం మంది వ్యతిరేకించారు. మార్చి నెల నుంచి దాదాపు 11 పాయింట్లు కోల్పోయారు.

మార్చితో పోల్చితే.. ప్రజల శ్రేయస్సు కోసం బైడెన్​ కృషి చేస్తున్నారని చాలా తక్కువ మంది చెప్పటం గమనార్హం. మరోవైపు.. ఆయన తన మాటపై నిలబడతారని, నిజాయితీగా, ఇతరులకు రోల్​మోడల్​గా ఉంటారని అతికొద్ది మంది మాత్రమే చెప్పారు.

కరోనా కట్టడిలో సానుకూలమే కానీ..

కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో బైడెన్​ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని 51 శాతం మంది చెప్పారు. అయితే.. అది మార్చి (65శాతం)తో పోల్చితే.. చాలా తక్కువ. అలాగే.. ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, ఇమ్మిగ్రేషన్​ విధానాల నిర్వహణలోనూ బైడెన్​పై అసంతృప్తి వ్యక్త పరిచారు అక్కడి ప్రజలు.

మరోవైపు.. దేశాన్ని ఏకతాటిపైకి తేవటంలోనూ బైడెన్​ విఫలమైనట్లు ప్రజలు భావిస్తున్నారు. మూడింట ఒకవంతు(34శాతం) మాత్రమే ఈ విషయంలో బైడెన్​కు ఓటు వేశారు. అది మార్చితో పోల్చితే.. 14 శాతం మేర క్షీణించింది. అలాగే.. ఆయన నమ్మిన విషయాలకు కట్టుబడి ఉంటారని 60 శాతం మందే చెప్పారు. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకుంటారని 54 శాతం మంది చెప్పారు. ఈ విషయాల్లో ఆరు నెలల క్రితం 66 శాతం, 62 శాతం ఆదరణ లభించింది.

ఇదీ చూడండి:బైడెన్​పై అమెరికన్లలో పెరుగుతున్న అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details