అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
మిషిగన్ రాష్ట్రంలో జో బైడెన్ 8 పాయింట్లు ముందంజలో ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్ విజయం సాధించడం గమనార్హం.
సీబీఎస్ న్యూస్ సర్వే :
సీబీఎస్ న్యూస్ సర్వేలో మిషిగన్, నెవాడా రాష్ట్రాల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. ట్రంప్‌కు 52శాతం ఓటర్లు మద్దతు పలకగా... జో బైడెన్‌కు 46 శాతం మంది జైకొట్టారు.
రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే :
రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం బైడెన్ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో ఈ సర్వే జరిపారు. విస్కాన్సిన్లో బైడెన్ 5.5 పాయింట్లతో, మిషిగన్‌లో 7 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
రాయటర్స్ సర్వే :
రాయటర్స్ నిర్వహించిన సర్వేలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో 5 పాయింట్లతో బైడెన్ ముందున్నారు. విస్కాన్సిన్లో 6 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి జో బైడెన్ 50శాతం ఓటింగ్‌తో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ పెన్సిల్వేనియాలో 45శాతం, విస్కాన్సిన్లో 44శాతం ఓటర్ల మద్దతు సాధించారు.