అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎన్నికకు కొన్ని గంటలే ఉన్న సమయంలో విడుదలైన ఎన్బీసీ న్యూస్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పోల్‌లో 10 పాయింట్ల ముందంజలో ఉన్నారు. బైడెన్ 52 శాతం ఓట్లు దక్కించుకోనుండగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 42 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది.
హోరాహోరీ పోటీ జరిగే 12 రాష్ట్రాల్లో బైడెన్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, అయోవా, మెయినీ, మిషిగన్, మిన్నెసోటా, ఉత్తర కరోలినా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో బైడెన్‌కు 51 శాతం మద్దతు లభిస్తుండగా.. ట్రంప్ 45 శాతం మద్దతు పొందుతున్నట్లు పోల్స్ తెలిపాయి.
బైడెన్‌కే జై!
నల్లజాతీయుల్లో 87 శాతం మంది బైడెన్‌వైపే ఉన్నారు. 5 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారు. యువ(18-34 ఏళ్ల మధ్య వయసున్న) ఓటర్లలో బైడెన్‌కు 60 శాతం, ట్రంప్‌కు 32 శాతం మద్దతిస్తున్నారు. సీనియర్లలో 58 శాతం బైడెన్, 35 శాతం ట్రంప్‌వైపు ఉన్నారు. మహిళల్లో 57 శాతం బైడెన్‌కు మద్దతిస్తుండగా.. 37 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నారు. డిగ్రీ పట్టా ఉన్న శ్వేతజాతీయుల్లో 56 శాతం జో బైడెన్‌కు మొగ్గుచూపుతుండగా..41 శాతం మంది ట్రంప్ వైపు ఉన్నారు.