ప్రజాస్వామ్యంపై డిసెంబర్ 9-10 తేదీల్లో అమెరికా వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా, రష్యాను (US china news) ఆయన ఈ సమావేశానికి దూరం పెట్టడం విశేషం. అగ్రరాజ్యం నేతృత్వంలోని నాటో సభ్యదేశమైన టర్కీకి కూడా ఆహ్వానం అందలేదు.
చైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటున్న తైవాన్‌కు (US taiwan relations) మాత్రం పిలుపు అందింది. ఇది అమెరికా- చైనా (US china ties) ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉంది.