అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో ఉన్నత పదవుల్లో ఒకటైన ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ నీరా టాండెన్ను ఎంపిక చేయాలని బైడెన్ భావిస్తున్నారు.
అమెరికా సెనేట్ నుంచి ఈ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడితే.. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా నీరా టాండెన్ చరిత్ర సృష్టిస్తారు. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ లెఫ్ట్-లీనింగ్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యుటివ్గా ఉన్నారు.