అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక పోరులో మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ దూసుకుపోతున్నారు. తాజాగా మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీస్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. ఫలితంగా డెమొక్రాట్ల తరఫున బిడెన్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.
మిషిగాన్, మిసిసిపి, మిస్సౌరీలో జరిగిన ప్రైమరీస్‌లో బిడెన్‌కు 788మంది ప్రతినిధులు మద్దతు పలికారు. ప్రత్యర్థి సాండర్స్‌కు అనుకూలంగా కేవలం 633మంది ఓటేశారు.
కీలకమైన మిషిగాన్‌లోనూ మాజీ ఉపాధ్యక్షుడు గెలుపొందడం ఎంతో కీలకంగా మారింది. నాలుగేళ్ల క్రితం ఇదే రాష్ట్రం నుంచి హిల్లరీ క్లింట్న్పై సాండర్స్ విజయం సాధించారు. ఇప్పుడు 78ఏళ్ల సాండర్స్‌ను బిడెన్ ఓడించారు.
ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం ఓ అభ్యర్థికి.. 3వేల 979 మంది ప్రతినిధుల్లో కనీసం 1,991 మంది మద్దతు లభించాలి. ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.