తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ ప్రమాణస్వీకారానికి వర్చువల్ ఏర్పాట్లు - వర్చువల్ ప్రమాణస్వీకారం

కరోనా నేపథ్యంలో కొద్ది మంది సమక్షంలోనే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు జో బైడెన్. అనంతరం అమెరికా సైనిక దళాల వందనాన్ని స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వవర్చువల్​గా పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Biden inauguration to feature virtual, nationwide parade
బైడెన్ ప్రమాణస్వీకారానికి వర్చువల్ ఏర్పాట్లు

By

Published : Jan 4, 2021, 10:56 AM IST

Updated : Jan 4, 2021, 11:47 AM IST

అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా విజయం సాధించిన జో బైడెన్‌ కొవిడ్‌ నేపథ్యంలో కొద్ది మంది అధికారుల సమక్షంలోనే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాధారణంగా లక్షల మంది అమెరికన్ల ముందు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సంప్రదాయం ఉన్నా... కొవిడ్‌ విజృంభణతో ఈ కార్యక్రమాన్ని అమెరికా అంతటా వర్చువల్‌గా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారులు ప్రకటన విడుదల చేశారు.

జనవరి 20న వాషింగ్టన్‌లో జరగబోయే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఆమె భర్త పాల్గొంటారు. ఈ రోజునే అమెరికా సైనిక దళాల వందనాన్ని కూడా బైడెన్ స్వీకరిస్తారు. వీరంతా భౌతిక దూరం నిబంధనలు పాటిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ ప్రజలు వర్చువల్‌గా భాగస్వాములు అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:'నాకు ఆ ఓట్లు కావాలి'- జార్జియా అధికారితో ట్రంప్​

Last Updated : Jan 4, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details