కరోనాతో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా సంఘీభావం ప్రకటించనున్నారు. మృతుల జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
జనవరి 19న సాయంత్రం 5.30 గంటలకు దేశవ్యాప్తంగా మెమోరియల్లు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడి ప్రమాణస్వీకార కమిటీ(పీఐసీ) తెలిపింది. వాషింగ్టన్లోని 'లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్'లో లైటింగ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఆహ్వానించనున్నట్లు స్పష్టం చేసింది. ఆ సమయంలో దేశంలోని చర్చిలన్నీ గంట మోగించాలని పిలుపునిచ్చింది.