తెలంగాణ

telangana

ETV Bharat / international

కొత్త అధ్యక్షుడు బైడెన్​ తీరని కోరిక! - బైడెన్ అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తొలిరోజే జో బైడెన్ తన కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారు. ప్రమాణ స్వీకారానికి దాదాపు 40 సంవత్సరాల పాటు రోజూ తాను ప్రయాణించిన.. రైలులో రావాలని బైడెన్‌ నిర్ణయించుకున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల ఇందుకు అధికారులు ఒప్పుకోలేదు.

biden
కొత్త అధ్యక్షుడు బైడెన్​ తీరని కోరిక!

By

Published : Jan 19, 2021, 5:45 AM IST

Updated : Jan 19, 2021, 6:40 AM IST

మునుముందు ఎలా ఉంటుందో తెలీదుగాని, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జో బైడెన్​ తొలిరోజే తన మనోభిష్టాన్ని వదులుకోవాల్సి వస్తోంది. ప్రమాణస్వీకారానికి తనకలవాటైన.. తనకిష్టమైన.. దాదాపు 40 ఏళ్లపాటు రోజూ తాను ప్రయాణించిన రైలులో రావాలని నిర్ణయించుకున్నారు బైడెన్. తన సొంత ఊరైన డెలవర్​ రాష్ట్రంలోని విల్​మింగ్టన్ పట్టణం నుంచి వాషింగ్టన్​లో ప్రమాణ స్వీకారానికి అమ్​ట్రక్​ (అమెరికా రైల్వే వ్యవస్థ) రైలులో ప్రయాణించాలనుకున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. కానీ.. తీరా.. ముహూర్తం వేళకు భద్రతా బృందం నో చెప్పింది. కారణం.. కొద్ది రోజుల క్రితం క్యాపిటలో జరిగిన అరాచకమే.

  • 1987లో తొలిసారిగా అధ్యక్ష బరిలోకి దిగినప్పుడు కూడా బైడెన్ తన సొంతూరులోని రైల్వే స్టేషన్ నుంచే అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
  • 2011లో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్‌ గౌరవార్థం విల్​మింగ్టన్ స్టేషన్ పేరును 'జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ రైల్‌రోడ్ స్టేషన్' అని ఆమ్‌ ట్రక్‌ మార్చింది.
  • ఇదీ చూడండి:బైడెన్​ జట్టులో మరో భారతీయ అమెరికన్​
Last Updated : Jan 19, 2021, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details