తెలంగాణ

telangana

ETV Bharat / international

3 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీతో బైడెన్ సంక్షేమ మంత్రం - republicans

కరోనా ఉపశమనం పేరిట 1 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీ తెచ్చిన అగ్రరాజ్యం.. 3 ట్రిలియన్​ డాలర్లతో మరో ప్యాకేజీ ప్రకటనకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం, మౌలిక రంగాలకు ఈ నిధుల్ని కేటాయించాలని భావిస్తోంది. తద్వారా దేశ ఆర్థి రంగాన్ని పరుగులు పెట్టించాలని యోచిస్తోంది.

Biden eyes USD 3 trillion package for infrastructure, schools, families
3ట్రిలియన్​ డాలర్లతో సంక్షేమ ప్యాకేజ్​?

By

Published : Mar 23, 2021, 11:24 AM IST

ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది అమెరికా ప్రభుత్వం. 'బిల్డ్ బ్యాక్​ బెటర్​' ఎన్నికల హామీని నెరవేర్చేలా ప్యాకేజీ రూపొందించడంపై అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం సాయంత్రం డెమొక్రటిక్ పార్టీ చట్టసభ్యులతో విస్తృతంగా చర్చించారు.

కరోనాతో దెబ్బతిన్న రంగాలకు సాయం అందించేందుకు ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ తీసుకొచ్చింది బైడెన్ ప్రభుత్వం.

విద్య, వైద్య రంగాల బలోపేతం

కరోనా ఉపశమనం ప్యాకేజీని... లాక్​డౌన్​ వల్ల దెబ్బతిన్న వ్యాపారులకు ఊతమివ్వడంపై ప్రధానంగా దృష్టి సారించి, రూపొందించారు. తాజాగా రూపొందిస్తున్న ప్యాకేజీ ద్వారా సగటు అమెరికన్ కుటుంబాలకు సాధ్యమైనంత సాయం అందించాలని బైడెన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. విద్య, వైద్యం విషయంలో వారికి అండగా నిలిచేలా ప్యాకేజీ ఉంటుందని తెలిసింది.

మౌలిక వసతులకు కొత్త రూపు

ఇందులో 1 ట్రిలియన్​ డాలర్లను రోడ్లు, వంతెనలు, రైల్వే లైన్లు, విద్యుత్​ వాహనాల ఛార్జింగ్ బంక్​లకు, సెల్​ఫోన్​ నెట్​వర్క్​ల అభివృద్ధి, విస్తరణకు కేటాయించనున్నారని తెలిసింది.

మౌలిక వసతులపై ఈ స్థాయిలో ఖర్చు చేయడం ద్వారా దేశ ఆర్థిక రంగం ఈ ఏడాదిలో 6.5 వృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:అంతా అమెరికానే చేసింది: రష్యా

ABOUT THE AUTHOR

...view details