తెలంగాణ

telangana

By

Published : Dec 2, 2020, 5:41 AM IST

ETV Bharat / international

బైడెన్‌ తొలిరోజు నిర్ణయం అదేనా?

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరే విషయంపైనే తొలి నిర్ణయం ప్రకటించబోతున్నట్లు బైడెన్ కార్యాలయం సూచనాప్రాయంగా వెల్లడించింది. తాజాగా జరిగిన జాతీయ భద్రతా, వాతావరణ విధాన నిపుణులతో బైడెన్‌ ఇదే విషయాన్ని చర్చించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Biden expresses sense of urgency in advancing climate goals
బైడెన్‌ తొలిరోజు నిర్ణయం అదేనా?

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయనే చెప్పవచ్చు. అయితే, వీటిని అధిగమించేందుకు జో బైడెన్‌ ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పారిస్‌ పర్యావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరే విషయంపైనే తొలి నిర్ణయం ప్రకటించబోతున్నట్లు బైడెన్ కార్యాలయం సూచనాప్రాయంగా వెల్లడించింది. తాజాగా జరిగిన జాతీయ భద్రతా, వాతావరణ విధాన నిపుణుల చర్చలో బైడెన్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయాలపై జో బైడెన్‌ వివిధ రంగాల నిపుణులతో చర్చించి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. తాజాగా జాతీయ భద్రతా, వాతావరణ విధానంపై నిపుణులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో, వాతావరణ మార్పులను తీవ్రంగా పరిగణిస్తోన్న జో బైడెన్‌, పర్యావరణ లక్ష్యాలను సాధించే ఆవశ్యకతను ఆయన మరోసారి నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే పారిస్‌ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరే అంశాన్ని నిర్ణయించారు. ఈ సమావేశంలో బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కమలా హారిస్‌ కూడా పాల్గొన్నారు.

పారిస్‌ ఒప్పందానికి ముందునుంచే‌ మద్దతు..

ప్రపంచ ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల తక్కువకు తగ్గించాలని ఒకే వేదికపైకి వచ్చిన 188 దేశాలు పారిస్ ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నాయి. బరాక్‌ ఒబామా నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం కూడా తొలుత ఈ ఒప్పందంలో చేరింది. కానీ, ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పు ఒప్పందం నుంచి వైదొలగాలంటే ఏడాది ముందే ఐక్యరాజ్యసమితికి సమాచారం ఇవ్వాలి. ఇందులో భాగంగా, గత సంవత్సరమే అమెరికా బయటకు వస్తున్నట్లు స్పష్టంచేసింది. తాజాగా నవంబర్‌ నాలుగో తారీఖు నుంచి అధికారికంగా ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. అయితే, అమెరికా చర్యను ఫ్రాన్స్‌, జపాన్‌తో పాటు ఇతర దేశాలు ఖండించాయి. అంతేకాకుండా ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో చాలా చోట్ల పర్యావరణ ప్రేమికులు ఉద్యమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై జరిగిన చారిత్రాత్మక ఒప్పందంలో అమెరికా తిరిగి చేరుతుందని బైడెన్‌ ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే, ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే, కఠిన నిర్ణయాలతో కూడా ఈ ఒప్పందాన్ని అమలుచేస్తే అమెరికా ఇంధన వనరులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని భావించిన ట్రంప్‌, దీన్ని తొలినుంచి వ్యతిరేకించారు.

ఇదీ చూడండి:ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్​ లూటీ

ABOUT THE AUTHOR

...view details