కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికా ప్రజలను ఆదుకునేందుకు ప్రకటించిన భారీ ఆర్థిక ఉపశమన ప్యాకేజీ తొలి భాగం వివరాలను జో బైడెన్ త్వరలో వెల్లడించనున్నారు. ఈ ప్యాకేజీలోని మొదటి భాగం నిధులతో రోడ్ల పునరుద్ధరణ, వంతెనలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టాలని యోచిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ వారం జో బైడెన్ విడుదల చేయనున్నట్లు అమెరికా ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఆదివారం స్పష్టం చేశారు. ప్యాకేజీని రెండు భాగాలుగా విభజిస్తున్నట్లు చెప్పారు.
"కాంగ్రెస్లో రిపబ్లికన్ల నుంచి మద్దతు పొందే ప్రయత్నంలో భాగంగా ప్యాకేజీని రెండు ప్రతిపాదనలుగా విభజించాలని చూస్తున్నాం. కానీ, ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి. దీనికోసం సెనేట్, ప్రతినిధుల సభతో కలిసి పని చేస్తాం."