వైట్‌హౌస్‌లో తాను నివసించేందుకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. గత అధ్యక్షులు చెప్పినట్టుగానే అధ్యక్ష భవనాన్ని బంగారు పంజరంతో పోల్చారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు వారాల అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"నేను ఉదయం నిద్ర లేచిన తర్వాత జిల్‌తో మనం ఎక్కడున్నామని అడుగుతాను(నవ్వుతూ). శ్వేతసౌధం సిబ్బంది నాకోసం ఎదురు చూడాలని అనుకోను. నాకు నేను అన్ని పనులు చేసుకోవాలనుకుంటాను."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్ నగరంలో బైడెన్ అంతకుముందు కార్యకలాపాలు సాగించేవారు. ఇటీవలే.. ఆయన డెలావేర్‌లోని విల్లింగ్టన్లో ఓ పెద్ద ఇంటికి మకాం మార్చారు.