తమ పాలన నుంచి చైనా గట్టి పోటీని ఆశిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే.. చైనాతో ఏర్పరచుకోనున్న ఆ బంధం.. సంఘర్షణతో కూడుకున్నది కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు బైడెన్. ఇప్పటివరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో తానింకా మాట్లాడలేదని ఆయన అన్నారు. అయితే.. గతంలో తాము ఉపాధ్యక్షులుగా ఉన్న కాలంలో తమ మధ్య సత్సంబంధాలున్నాయని బైడెన్ గుర్తుచేశారు. జిన్పింగ్ తనకు సన్నిహితుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లాగా.. తాను అమెరికా-చైనా సంబంధాలను కొనసాగించబోనని బెడెన్ స్పష్టం చేశారు. కేవలం అంతర్జాతీయ అంశాలపైనే దృష్టి సారిస్తానని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదం కోరుకోవట్లేదన్న బైడెన్.. చైనాయే తీవ్ర పోటీని ఆశిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా పంపుతోందన్నారు.