కొవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వ్యాక్సినేషన్ నియమాలకు సహకరించని రిపబ్లికన్ గవర్నర్లను 'అడ్డు తప్పుకోవాలి' అని హెచ్చరించారు. తాజాగా అమెరికాలో లక్షకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బైడెన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలంగా మారాయి.
ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ట్ సహా ఇతర అధికారులపై మండిపడ్డారు బైడెన్. కొవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో.. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని అమెరికా ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకోనివారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో డెల్టా వ్యాప్తి తీవ్రమవుతోందని అన్నారు.