తెలంగాణ

telangana

ETV Bharat / international

భారతీయ అమెరికన్ నామినేషన్​ను రద్దు చేసిన బైడెన్​​ - డొనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నిర్ణయాలని ఒక్కోటి రద్దు చేస్తోన్న అధ్యక్షుడు బైడెన్​ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొలంబియా జడ్జీగా భారతీయ అమెరికన్ నియామకంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనను​ బైడెన్ రద్దు చేశారు. ​ ​

trump, biden, vijay shankar
ట్రంప్​ నామినేషన్​ను రద్దు చేసిన బైడెన్​

By

Published : Feb 5, 2021, 7:37 PM IST

అమెరికాలోని కొలంబియా జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్ విజయ్​ శంకర్​ నియామకంపై అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను జడ్జీగా నియమించాలన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ చేసిన నామినేషన్​ను రద్దు చేస్తున్నట్లు శ్వేతసౌథం గురువారం ప్రకటించింది. వాషింగ్టన్​లో కార్యకలాపాలు నిర్వహించే కొలంబియా కోర్ట్​ ఆఫ్ అప్పీల్స్​కు విజయ్​ శంకర్​ను జడ్జీగా నియమించాలని.. గతేదాడి జూన్​లో సెనేట్​కు ప్రతిపాదించారు ట్రంప్​. అయితే ఆ నామినేషన్​ను సెనేట్​ ఆమోదించలేదు.

ఇప్పటివరకు ట్రంప్​ దాఖలు చేసిన 32 నామినేషన్లను బైడెన్​ రద్దు చేశారు. వీటిలో 17 జడ్జీ నియామకాలకు సంబంధించి ఉండటం గమనార్హం. ట్రంప్​ నామినేట్​ చేసిన సమయానికి విజయ్​ శంకర్ న్యాయశాఖలోని పునర్విచారణ విభాగానికి డిప్యూటీ చీఫ్​గా విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి :హెచ్​1బీ వీసా నిబంధనల అమలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details