అగ్రరాజ్య అధ్యక్ష పగ్గాలను జో బైడెన్(Joe Biden) చేపట్టాక.. అమెరికా, చైనా సంబంధాలు(China Us News) క్షీణించాయన్న విమర్శలు వినిపిస్తున్న వేళ గురువారం కీలక పరిణామం జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బైడెన్ ఫోన్లో(Biden Phone Call) మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై(Us China Relationship) ఇరువురూ చర్చించారు. ఇరు దేశాధినేతల మధ్య విస్త్తృత, వ్యూహాత్మక సంభాషణ జరిగిందని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
"అమెరికా, చైనా దేశాధినేతలు తమ ఉమ్మడి ఆసక్తులపై చర్చించారు. తమ ఆసక్తులు, విలువలు, దృక్కోణాలు విభిన్న అంశాలపై చర్చించారు. ఈ సంభాషణలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును అమెరికా కోరుకుంటోందని బైడెన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పోటీ.. వివాదాస్పదంగా మారకుండా బాధ్యత వహించాల్సిన అంశంపై వారు చర్చించారు."
-వైట్‌హౌస్.