బైడెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ Biden calling reporter SOB: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ రిపోర్టర్‌పై నోరుపారేసుకున్నారు. ధరల పెరుగుదల గురించి ప్రశ్నలు అడిగిన విలేకరిపై అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు.
Biden Fox News reporter
వాషింగ్టన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధ్యక్షుడు బైడెన్‌ను.. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ ధరల పెరుగుదలపై ప్రశ్నించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల మిడ్‌టెర్మ్ ఎలక్షన్స్ ఫలితాలపై ప్రభావం పడుతుందా అని అడిగారు. దీనికి బదులిచ్చిన బైడెన్.. 'అధిక ద్రవ్యోల్బణంతో లాభమే. స్టుపిడ్ సన్ ఆఫ్ ఎ **' అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా కెమెరా, మైక్రోఫోన్లలో రికార్డైంది.
దీనిపై శ్వేతసౌధం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, రిపోర్టర్‌కు బైడెన్ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. పీటర్ డూసీని అధ్యక్షుడు తన కార్యాలయనికి పిలిచినట్లు అధికారులు వెల్లడించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు ఆయన్ను రమ్మన్నట్లు చెప్పారు.
Biden FOX news peter doocy
అయితే, ఇటీవల ఫాక్స్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లు, బైడెన్ మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతవారం రష్యా గురించి ఫాక్స్ న్యూస్ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నపై గుర్రుమన్నారు. 'ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తొలి అడుగు వేసేంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని మహిళ అడగ్గా.. 'అదో చెత్త ప్రశ్న' అని కొట్టిపారేశారు.
గతవారం పీటర్ డూసీతోనూ దురుసుగా మాట్లాడారు బైడెన్. 'నువ్వు నన్ను ఎప్పుడూ మంచి ప్రశ్నలే అడుగుతావు' అని డూసీని ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా అన్నారు. దానికి రిపోర్టర్.. 'నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి' అని బదులివ్వగా.. 'అవును.. నీ దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. కానీ అందులో ఒక్కటి కూడా పనికొచ్చేదని నాకు అనిపించదు' అని ఎదురుదాడి చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!