తెలంగాణ

telangana

ETV Bharat / international

biden: 'కరోనా మూలాలపై కూపీ లాగండి' - కరోనా పుట్టుకపై పరిశోధనలు

కరోనా మహమ్మారి(covid pandemic) పుట్టుకకు సంబంధించి పరిశోధనలు మరింత ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆ దేశ నిఘా సంస్థలను ఆదేశించారు. వైరస్​ మూలాలను కనుగొనే ప్రక్రియలో ప్రయోగశాలలు ముందుకు రావాలని కోరారు.

Biden
వైరస్​ మూలాలను కనుగొనే దిశగా బైడెన్​ కీలక ఆదేశాలు

By

Published : May 27, 2021, 9:40 AM IST

ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మూలాలను శోధించడానికి అడుగులు చకచకా పడుతున్నాయి. వైరస్​ పుట్టుకకు సంబంధించి పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden)..​ ఆ దేశ నిఘా సంస్థలను కోరారు. ఈ వైరస్​ జంతువుల నుంచి సోకిందా, సహజ సిద్ధంగా ఉద్భవించిందా? లేక ప్రయోగ శాలల్లో రూపొందించిందా అనే దానిపై సరైన సాక్ష్యాలు లేవని, ఆధారాలు సరిపోవడం లేదని బైడెన్​ తెలిపారు.

కొవిడ్ పుట్టుకకు గల కారణాలు ఒకటికి మూడు ఉన్నట్లు ఉన్నాయన్న ఆయన వాటిని అంచనా వేసేందుకు తగిన సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పారు. ఈ దర్యాప్తుకు అమెరికాలోని జాతీయ ప్రయోగశాలలన్నీ సహకరించాలని ఆదేశించారు. వైరస్​ మూలాలు గురించి అంతర్జాతీయ పరిశోధనలతో కలిసి చేసేందుకు చైనా కలసి రావాలని పిలుపునిచ్చారు. చైనాపై ఒత్తిడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో కలిసి అమెరికా పని చేస్తుందని బైడెన్​ చెప్పారు.

అంతర్జాతీయ పరిశోధనలకు పూర్తి స్థాయిలో సహకరించడానికి చైనా ప్రభుత్వం సుముఖంగా లేదని, ఇలా ఉంటే ఎప్పటికీ ఈ విషయంపై ఓ అంచనాకు రాలేమని తెలిపారు.

ఇదీ చూడండి:కొవిడ్ 'ల్యాబ్ లీక్'​పై చైనా స్వతంత్ర దర్యాప్తు?

ABOUT THE AUTHOR

...view details