వైట్‌హౌస్ మిలటరీ ఆఫీస్ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ మజూ వర్గీస్‌ను నియమించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. వర్గీస్.. బైడెన్-హారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా, సీనియర్ సలహాదారుగా సేవలందించారు. మిలటరీ ఆఫీస్ డైరెక్టర్‌గా తనను నియమించినట్టు.. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు వర్గీస్.
శ్వేతసౌధం మిలటరీ కార్యాలయం అనేది.. అక్కడ జరిగే పలు అధికారిక వేడుకలు, వైద్య సదుపాయం, అత్యవసర సేవలు, అధ్యక్షుని రవాణా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వర్గీస్ వీటికి డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు, క్యాపిటల్ భవనంపై దాడుల నేపథ్యంలో.. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు వర్గీస్.