అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. పర్యావరణం, విద్యుత్తు విభాగాలకు సంబంధించి 'ఆశాజనకమైన పథకాలను' ముందుకు తీసుకెళ్లేందుకు నూతన అధికార సభ్యులను ప్రకటించారు. సభ్యులను 'సరైన బృందం'గా అభివర్ణించారు బైడెన్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులను ప్రశంసించారు.
సరైన గ్రూపు ఇదే..
న్యూ మెక్సికో ప్రతినిధి డెబ్ హాలండ్ను.. ఇంటీరియర్ సెక్రటరీగా నియమించారు. మిషిగన్ మాజీగవర్నర్ జెన్నిఫర్ గ్రాన్హోమ్ను విద్యుత్తు సెక్రటరీగా నియమించారు. పర్యావరణ సంరక్షణ ఏజెన్సీకి మైకేల్ రేగాన్ను నియమించారు. సెనేట్ రేగాన్ నియామకాన్ని ఆమోదిస్తే.. ఈ పదవిలో నియమితులైన మొదటి నల్ల జాతీయుడిగా ఆయన నిలుస్తారు. జినా మెకార్తిని జాతీయ పర్యావరణ సలహాదారులుగా నియమించారు.