అమెరికా- చైనా సంబంధాలు(US china relationship) క్షీణిస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం(నవంబర్ 15) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden China), చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వర్చువల్ వేదికగా భేటీ కానున్నారని శ్వేతసౌధం ప్రకటించింది.
'అధ్యక్షుడు బైడెన్.. సెప్టెంబర్ 9న జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే.. ఇరు దేశాల మధ్య పోటీ వివాదాస్పదంగా మారకూడదనే అంశంపై ప్రస్తుత వర్చువల్ భేటీలోనూ మాట్లాడనున్నారు.' అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.
ఈ వర్చువల్ భేటీలో ఇరు దేశాలు తమ ఉమ్మడి ఆసక్తులపై విస్తృతంగా చర్చించనున్నట్లు సాకి పేర్కొన్నారు. గతంలో బైడెన్, జిన్పింగ్ ఫోన్ సంభాషణ నేపథ్యంలో.. ఏడాది చివరిలో వర్చువల్గా భేటీగా కానున్నట్లు నిర్ణయించుకున్నారని తెలిపారు.