అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 లక్షలు దాటిన వేళ ఆ దేశ ప్రెసిడెంట్- ఎలెక్ట్ జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్.. కొవిడ్‌తో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. వాషింగ్టన్ నేషనల్ మాల్‌లోని లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ వద్దకు తమ జీవిత భాగస్వామ్యులతో కలిసి వెళ్లిన బైడెన్, హారిస్.. కొవిడ్ మృతులకు ఘననివాళి అర్పించారు.
కొవిడ్ మృతులకు బైడెన్, కమల నివాళి
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైెడెన్, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్.. కరోనాతో మరణించిన వారికి నివాళులు అర్పించారు. కొన్ని ఘటనలను గుర్తుంచుకోవటం ఎంతో కష్టమని బైడెన్ అన్నారు.
కొవిడ్ మృతులకు బైడెన్, కమలా హారిస్ నివాళి
కొన్ని ఘటనలను గుర్తుంచుకోవటం ఎంతో కష్టమన్న బైడెన్, వాటిని అధిగమించేందుకు గుర్తుపెట్టుకోక తప్పదని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికన్లు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారనీ వాటిని నిర్మూలించేందుకు కలిసి కట్టుగా పనిచేద్దామని కమలా హారిస్ అన్నారు. కొవిడ్ బారిన పడి చనిపోయిన వారంతా శారీరకంగా మనకూ దూరమైనటప్పటికీ అమెరికా ప్రజల మనస్సులకు దగ్గరగానే ఉంటారని హారిస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి :పెలోసీ ల్యాప్‌టాప్ చోరీ- రష్యాకు విక్రయించే యత్నం!