అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శల పదును పెంచారు డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. సైన్యాన్ని ట్రంప్ తన సొంత ఆస్తిలా వినియోగించారని, తాను అలా చేయబోనన్నారు. వ్యక్తిగత ప్రతీకారాలు, పౌర హక్కులు ఉల్లంఘించేలా సైన్యాన్ని ట్రంప్ ఉపయోగించారని ఆరోపించారు. నేషనల్ గార్డ్ అసోసియేషన్ శనివారం నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో ప్రసంగించారు బైడెన్. ఒకవేళ నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడకపోతే సైన్యమే ఆయన్ను ఖాళీ చేయిస్తుందన్నారు.
'శ్వేతసౌధం నుంచి ట్రంప్‌ను సైన్యమే ఖాళీ చేయిస్తుంది' - అమెరికా అధ్యక్ష ఎన్నికలు
నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి శ్వేతసౌధాన్ని వీడేందుకు నిరాకరిస్తే సైన్యమే ఆయన్ను ఖాళీ చేయిస్తుందన్నారు జో బైడెన్. తాను అధికారంలోకి వస్తే పౌర, సైనిక శక్తుల విభజనను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు.
'శ్వేతసౌధం నుంచి ట్రంప్‌ను సైన్యమే ఖాళీ చేయిస్తుంది'
తాను అధికారంలోకి వస్తే పౌర, సైనిక శక్తుల విభజనను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు బైడెన్. అమెరికా ప్రజలకు శాంతియుత నిరసనలు చేపట్టే హక్కు ఉందన్నారు.