తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్‌ సలహాదారులు - ఆంటోనీ ఫౌచీ

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందం టీకా తయారీదారులతో త్వరలో చర్చలు జరపనుంది. వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న ఫైజర్‌, ఇతర ఔషధ కంపెనీలతో చర్చలు జరుపుతామని బైడెన్‌ బృందం సభ్యుడు రాన్‌ క్లెయిన్‌ తెలిపారు. ప్రజారోగ్య సంక్షోభం ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించడంలో జాప్యం జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

Biden advisers to meet vaccine firms as Trump stalls handoff
టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్‌ సలహాదారులు

By

Published : Nov 16, 2020, 7:28 AM IST

అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలోని శాస్త్రీయ సలహాదారులు రానున్న రోజుల్లో టీకా తయారీదారులతో చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరితో అధికార బదలాయింపుపై అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ప్రజారోగ్య సంక్షోభమున్న తరుణంలో.. కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించడంలో జాప్యం జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌' అధిపతి ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నివారణకు టీకా తయారీదారులతో ఇప్పటి నుంచే కసరత్తు చేయడం మంచిదని తెలిపారు.

వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న ఫైజర్‌, ఇతర ఔషధ కంపెనీలతో చర్చలు జరుపుతామని బైడెన్‌ బృందం సభ్యుడు రాన్‌ క్లెయిన్‌ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details