లక్షల సంఖ్యలో మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నిర్ణయించారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు బైడెన్ తెలిపారు. అయితే ట్రంప్ సర్కార్ ఈ కార్యక్రమాన్ని చేపడదామనుకుని వెనుకడుగు వేసింది.
దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం
దేశవ్యాప్తంగా మాస్కులు పంపిణీ చేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. అమెరికాలో వైరస్ విజృంభిస్తున్న తరుణంలో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం
అయితే ఈ కార్యక్రమం వివరాలు, వ్యయం, ఎప్పుడు మొదలుపెడతారు, ఎలాంటి మాస్కులు ఇస్తారనే విషయాన్ని శ్వేతసౌధం ఇంకా తెలుపలేదు.
బైడెన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి మొదటి 100 రోజులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. వాటితో పాటు ప్రజారవాణా, కార్యాలయాల్లోనూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు బైడెన్.
- ఇదీ చూడండి:బైడెన్ జట్టులో మరో భారతీయ అమెరికన్