అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన తాలిబన్ ఒప్పందంపై బైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒప్పందాన్ని సమీక్షించనున్నట్టు వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల కార్యకలాపాలను పరిశీలించి ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రత సలహాదారులు చర్చలు జరిపారు. ఈ విషయంపై అమెరికా జాతీయ భద్రత మండలి ప్రతినిధి ఎమిలీ హోర్న్ వివరణ ఇచ్చారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు ఫలించేలా అమెరికా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
తాలిబన్ ఒప్పందంపై అమెరికా యూటర్న్! - taliban
అఫ్గానిస్థాన్ నుంచి సైన్యం ఉపసంహరణపై అగ్రరాజ్యం కీలక ప్రకటన చేసింది. తాలిబన్ల కార్యకలాపాలను గమనించాకే ఈ చర్యపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాలిబన్ ఒప్పందంపై అమెరికా యూటర్న్!
గతేడాది ఫిబ్రవరిలో అమెరికా తాలిబన్ల మధ్య ఒప్పందం జరిగింది. అఫ్గాన్‌లో తాలిబన్లు హింసకు పాల్పడకుండా ఉంటే తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని అగ్రరాజ్యం పేర్కొంది. ఈ ప్రకారం ఇప్పటికే అమెరికా చర్యలు చేపడుతోంది. తాజాగా వెల్లడైన ప్రకటనతో.. ఉపసంహరణ తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. అమెరికాతో ఒప్పందం జరిగి ఏడాది అయినా తాలిబన్ల దాడులు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి :భారత్ ఓ నిజమైన మిత్ర దేశం: అమెరికా