అమెరికా పరిపాలన విభాగంలో భారత సంతతి వ్యక్తులకు ఇప్పటికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్షుడు జో బైడెన్. తాజాగా మరి కొంత మంది ప్రవాస భారతీయులకు కీలక పదవులు అప్పగించారు.
కీలక ఇంధన రంగంలో నలుగురు భారత సంతతి వ్యక్తులను సీనియర్ అధికారులుగా బైడెన్ ప్రభుత్వం నియమించింది. భారతీయ అమెరికన్ తారక్ షాను చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించగా.. ఆ పదవిలో పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. తారక్ షా 2014-17 మధ్య సైన్స్ అండ్ ఎనర్జీ విభాగంలో అండర్ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. ఒబామా సెనేట్, అధ్యక్ష ఎన్నికల ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు. తన్యా దాస్‌ను సైన్స్ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గానూ, నారాయణ్ సుబ్రమణియన్‌ను జనరల్ కౌన్సిల్ కార్యాలయంలో న్యాయ సలహాదారునిగా నియమించారు. శుచీ తలాటిని అమెరికా శిలాజ ఇంధన కార్యాలయ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తూ బైడెన్ ఉత్తర్వులు జారీచేశారు. వీరితో పాటు వివిధ దేశాల మూలాలున్న 19 మందిని ఇంధన విభాగంలోని ఇతర పదవులకు ఎంపిక చేశారు.