తెలంగాణ

telangana

బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారతీయ-అమెరికన్లు!

By

Published : Feb 14, 2021, 1:07 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయ-అమెరికన్లు కీలక పదవుల్లో నియమితులయ్యారు.

Biden administration appoints 2 Indian-origin experts to key positions
బైడెన్​ బృందంలో మరో ఇద్దరు భారతీయ-అమెరికన్లు!

మరో ఇద్దరు భారతీయ-అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. స్వచ్ఛంద సేవకు సంబంధించిన ఫెడరల్​ ఏజెన్సీ 'అమెరికార్ప్స్'​లో పని చేసేందుకు అవకాశం కల్పించారు.

ఓడినా...

'అమెరికార్ప్స్'​కు జాతీయ వ్యవహారాల డైరెక్టర్​గా సోనాలీ నిజ్వాన్​ నియమితులయ్యారు. మరో భారతీయ అమెరికన్​ శ్రీ ప్రిస్టన్ కులకర్ణి.. విదేశీ వ్యవహారాల సారథిగా ఎంపికయ్యారు. డెమొక్రటిక్​ పార్టీ తరఫున అమెరికన్​ కాంగ్రెస్​కు టెక్సాస్​ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూసినప్పటికీ కులకర్ణికి ఈ గుర్తింపు దక్కడం విశేషం.

ఇదీ చదవండి:'అమెరికాలో పాఠశాలల పునః ప్రారంభమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details