తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​తో బంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నాం' - లాయిడ్ జే ఆస్టిన్​ ఫోన్​ సంభాషణ

భారత్​- అమెరికా మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు అధ్యక్షుడు బైడెన్​ బృందం కట్టుబడి ఉందని అమెరికా రక్షణ విభాగం 'పెంటగాన్' తెలిపింది. ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Pentagon US-India bilateral relationship
'భారత్​-అమెరికా మైత్రి మరింత బలోపేతం'

By

Published : Jan 29, 2021, 12:59 PM IST

భారత్​-అమెరికా మైత్రిని బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్ బృందం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అగ్రరాజ్య రక్షణ విభాగం 'పెంటగాన్'​ పేర్కొంది. అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్, భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ మధ్య ఫోన్​ సంభాషణ జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది పెంటగాన్.

"ఇరు దేశాల రక్షణ మంత్రులు అనేక విషయాలు చర్చించారు. కరోనా కట్టడిలో ఇరు దేశాలు చేపట్టిన చర్యల గురించి మాట్లాడారు." అని పెంటగాన్​ మీడియా ప్రతినిధి జాన్​ కిర్బీ వివరించారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పరస్పరం సహాయం చేసుకోవాల్సిన అవసరాన్ని ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చించారని తెలిపారు.

గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో భారత్​ తమ అతిపెద్ద భాగస్వామి అని అమెరికా 2016లో ప్రకటించింది.

ఇదీ చదవండి:పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై శ్వేతసౌధం ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details