డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన హెచ్1బీ వీసా నిబంధనల అమలును వాయిదా వేస్తున్నట్లు జో బైడెన్ సర్కారు తెలిపింది. లాటరీ విధానం డిసెంబర్ 31 వరకు కొనసాగిస్తామని పేర్కొంది. వలస విధానంలో మార్పులతో సహా, నూతన విధానాన్ని విజయవంతంగా పరీక్షించేందుకు ఈ సమయాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:హెచ్1బీ వీసాదారులపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం
విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఇచ్చే హెచ్-1బీ వీసాల జారీలో ఉన్న లాటరీ వ్యవస్థను స్తంభింపచేస్తూ ట్రంప్ సర్కారు జనవరి 7న ఆదేశాలు ఇచ్చింది. మార్చి 9 నుంచి ఇది అమల్లోకి రానుంది. అయితే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్ ఏడాది చివరి వరకు లాటరీ విధానాన్ని అమల్లో ఉంచాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'పాకిస్థాన్‌ను భ్రష్టు పట్టిస్తోంది ప్రభుత్వమే'