తెలంగాణ

telangana

ETV Bharat / international

సొంత పార్టీ నుంచే  బైడెన్​పై విమర్శల వెల్లువ! - భారత్​కు అమెరికా సాయం

భారత్​కు మిత్రపక్షంగా ఉన్న అమెరికాపై.. కరోనా విజృంభణ వేళ సహాయం చేయకుండా ముఖం చాటేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మిగులు టీకాలను భారత్​కు సహాయంగా అందించాలని భారత సంతతి అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు.

joe Biden
జో బైడెన్

By

Published : Apr 25, 2021, 11:50 AM IST

అమెరికాలోని మిగులు టీకాలను కరోనా కోరల్లో చిక్కుకున్న భారత్‌కు ఎగుమతి చేయకపోవడం పట్ల అధ్యక్షుడు జో బైడెన్‌ పరిపాలన తీరుపై.. సొంత పార్టీ డెమొక్రటిక్‌ సభ్యులే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలో ఉన్న దేశాలకు ఆస్ట్రాజెనెకా టీకాలను విడుదల చేయాలని భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. భారత్‌లో ప్రజలకు కరోనా టీకా అవసరమైనప్పుడు.. తాము వాటిని గిడ్డంగిలో దాచలేమని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజారోగ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి అమెరికా టీకాలను తక్షణమే సరఫరా చేయాలని రాజా కృష్ణమూర్తి అన్నారు. భారత్‌, అర్జెంటీనా సహా కరోనా ప్రభావిత రాష్ట్రాలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను పంపాలని కోరారు. ఇప్పటికీ టీకాను సరఫరా చేయకపోతే బైడెన్‌ ప్రభుత్వం సద్భావనను కోల్పోయే అవకాశం ఉందని బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన తన్వి మదన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారత్‌కు ఆపన్న హస్తం అందించేందుకు శత్రు దేశాలు కూడా ముందుకొస్తున్నాయని.. ఇప్పుడు కూడా అమెరికా ముందుకు రాకపోతే బైడెన్‌ పాలన గత కొన్ని నెలల్లో సంపాదించిన మంచిని కోల్పోతోందని మదన్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details