ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఆమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్.. వచ్చే నెలలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం తెలిపారు. బ్లూ ఆరిజిన్ ప్రాజెక్టు మొదటి వ్యోమనౌక ద్వారా జులై 20న ఈ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తన సోదరుడు, బ్లూ ఆరిజిన్ వేలంలో విజేతగా నిలిచిన వ్యక్తితో కలిసి తాను అంతరిక్షంలోకి వెళ్తానని బెజోస్ తెలిపారు. అమెరికా టెక్సాస్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
చంద్రుడిపై 'అపోలో 11' ల్యాండ్ అయిన రోజు జులై 20నే కాబట్టి.. బెజోస్ తన అంతరిక్ష యాత్రను కూడా ఈ తేదీనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా.. అమెజాన్ సీఈఓగా వైదొలిగి.. బ్లూ ఆరిజిన్ ప్రాజెక్టుపై దృష్టి సారిస్తానని ఫిబ్రవరిలో బెజోస్ తెలిపారు.
"అంతరిక్షం నుంచి భూమిని చూస్తే.. ఇది చాలా మార్పులను తెస్తుంది. ఈ గ్రహంతో మీకు ఉన్న సంబంధాలనూ మార్చేస్తుంది. ఉన్నది ఒకటే భూమి. నేను ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే.. అది నా జీవితంలో చేయాలనుకునే అతి పెద్ద సాహసం."