తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ అభ్యర్థికే 'సుప్రీం' పగ్గాలు - డొనాల్డ్​ ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ఎంపిక చేసిన అభ్యర్థిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిర్ణయించింది సెనేట్​. 52-48 ఓట్ల తేడాతో ఎమీ కోనీ బారెట్​ విజయం సాధించారు. సెనేట్​ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే బారెట్​ ప్రమాణస్వీకారం చేశారు.​ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది రిపబ్లికన్లకు ఉత్తేజాన్నిచ్చే వార్త.

Barrett confirmed as Supreme Court justice in partisan vote
ట్రంప్ అభ్యర్థికే 'సుప్రీం' పగ్గాలు

By

Published : Oct 27, 2020, 7:37 AM IST

Updated : Oct 27, 2020, 9:16 AM IST

జస్టిస్​ ఎమీ కోనీ బారెట్​ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమోదించింది అమెరికా సెనేట్​. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తాను ఎంపిక చేసిన అభ్యర్థి విజయం సాధించడం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు కలిసొచ్చే విషయం.

52-48 తేడాతో ఎమీ విజయం సాధించగా.. ఒక్క డెమోక్రాట్​ కూడా ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేదు.

7వ యూఎస్​ సర్క్యూట్​ కోర్ట్​ ఆఫ్​ అప్పీల్స్​ జడ్జిగా అమీ విధులు నిర్వర్తించారు. సెనెట్​ ఆమోదంతో 115వ అసోసియేట్​ జస్టిస్​ ఆఫ్​ సుప్రీంకోర్టుగా బాధ్యతలు చేపట్టనున్నారు ఎమీ. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారసురాలిగా బారెట్‌ను ప్రకటిస్తూ వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ గత నెల 26న భారీ కార్యక్రమం నిర్వహించారు.

రిపబ్లికన్ల విజయం..

ఎమీ బారెట్​ గెలవడం వల్ల రిపబ్లికన్లు విజయం సాధించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పులపై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముండటం ఇందుకు కారణం.

సెనేట్​ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ప్రమాణస్వీకారం చేశారు బారెట్​. పదవిని చేపట్టడం ఎంతో గౌరవంగా ఉందన్నారు.

'ఇది చిరస్మరణీయం'

అమెరికా రాజ్యాంగం, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థకు ఇదొక చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించారు అధ్యక్షుడు ట్రంప్​. అత్యున్నత న్యాయస్థానంలో ఎమీ అసాధారణమైన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

అమెరికాలో సుప్రీంకోర్టు జస్టిస్​కు పదవీ విరమణ ఉండదు. ఒకసారి ఎంపికైతే.. జీవితకాలం పాటు అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మొత్తం 9మంది జడ్జిలు ఉండగా వారిలో ముగ్గురిని ట్రంప్​ నామినేట్​ చేశారు.

ఇదీ చూడండి:-ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు బైడెన్​ కే!

Last Updated : Oct 27, 2020, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details