తెలంగాణ

telangana

ETV Bharat / international

'చైనా నిఘాను తప్పించుకునే అతిపెద్ద ఆయుధం అదే' - Apps ban

భారత్​ సహా పలు దేశాలు టిక్​టాక్​ వంటి చైనా యాప్​లను నిషేధించటం.. చైనా నిఘా చర్యల నుంచి తప్పించుకునే అతిపెద్ద ఆయుధంగా పేర్కొంది అమెరికా. అగ్రరాజ్యం సైతం టిక్​టాక్​, వీచాట్​ యాప్​ల నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్​ ఓబ్రెయిన్​. యాప్​ల ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Banning TikTok takes a big tool away from Chinese surveillance work
'టిక్​టాక్​ నిషేధం.. చైనా నిఘాను తప్పించుకునే అతిపెద్ద ఆయుధం'

By

Published : Jul 15, 2020, 10:05 AM IST

టిక్​టాక్​ సహా పలు చైనా యాప్​లను భారత్ నిషేధించటాన్ని మరోమారు సమర్థించింది అమెరికా. టిక్​టాక్​ వంటి మొబైల్​ యాప్​లను నిషేధించటం.. చైనా నిఘా నుంచి తప్పించుకునేందుకు తీసుకున్న అతిపెద్ద ఆయుధంగా పేర్కొన్నారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్​ ఓబ్రెయిన్​. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పరిపాలన విభాగం.. టిక్​టాక్​, వీచాట్​ వంటి చైనా యాప్​ల నిషేధాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

"అలాంటి యాప్​లను భారత్​ ఇప్పటికే నిషేధించింది. వారు భారత్​, అమెరికాలను కోల్పోతే.. కొన్ని పశ్చిమ యూరప్​ దేశాలనూ కోల్పోతారు. అది చైనా కమ్యూనిస్ట్​ పార్టీ చేసే గూఢచర్యం, నిఘా పనుల నుంచి తప్పించుకునే పెద్ద ఆయుధం అవుతుంది. టిక్​టాక్​ చాలా వినోదాన్ని అందిస్తుంది. కానీ, అది మీ గుర్తింపు వివరాలను పొందుతుంది. వారు మీ వ్యక్తిగత, ప్రైవేటు సమాచారాన్ని సేకరిస్తారు. మీ స్నేహితులు, కుటుంబసభ్యులు సహా అన్ని సంబంధాలను గుర్తిస్తారు. ఈ సమాచారం మొత్తం నేరుగా చైనాలోని అతిపెద్ద సూపర్​ కంప్యూటర్లకు చేరుతుంది. దాని ద్వారా మీ ప్రతి విషయాన్ని చైనా తెలుసుకుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి."

- రాబర్ట్​ ఓబ్రెయిన్​, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

మారియట్​ను హ్యాక్​ చేసి, లక్షల మంది ప్రజల పాస్​పోర్ట్​ నంబర్లతో సహా వ్యక్తిగత డేటాను చైనా దొంగిలించిందని ఆరోపించారు రాబర్ట్​. ఎక్స్​పీరియన్​ సహా ఇతర క్రెడిట్​ రేటింగ్​ సంస్థలు, ఆరోగ్య కేంద్రాలను హ్యాక్​ చేసి చాలా సున్నితమైన క్రెడిట్​ సమచారం, పౌరుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించారని పేర్కొన్నారు.

కృత్రిమ మేధ, సూపర్​ కంప్యూటింగ్​ ద్వారా వారు త్వరలోనే అమెరికన్లు, ప్రపంచంలోని ప్రతిఒక్కరిపై సామాజిక క్రెడిట్​ స్కోర్​లను ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ, అది జరగనివ్వబోమని పేర్కొన్నారు ఓబ్రెయిన్​

ఇదీ చూడండి: జాగ్తేరహో: సైబర్​ నేరగాళ్లకు సరికొత్త ఆయుధంగా టిక్​టాక్​!

ABOUT THE AUTHOR

...view details