మేరీలాండ్ బాల్టిమోర్ సిటీలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 23 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు చేపట్టి 21 మంది బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని అగ్నిమాపక సిబ్బంది అధికారులు పేర్కొన్నారు. 9 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, మిగతా వారి పరిస్థితీ విషమంగా ఉందని వెల్లడించారు.
భవనంలో ఇరుక్కుపోయిన కూలీలను సహాయక చర్యలు చేపట్టి కిటీకి నుంచి బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు సంభవించడానికి కారణమేంటో తెలియాల్సి ఉందన్నారు.