తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెజాన్' సంరక్షణకు ముందుకొచ్చిన ఆదివాసీలు - ప్రాణాలు

అమెజాన్ అడవుల్లో అంతకంతకూ విస్తరిస్తున్న కార్చిచ్చు... ఆదివాసీలు, మూగజీవాల ఆవాసాల్ని నాశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ జీవనాధారమైన అరణ్యాలను రక్షించుకోవడానికి ఆదివాసీలు ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రజల సహకారాన్ని వారు కోరుతున్నారు.

'అమెజాన్' సంరక్షణకు ముందుకొచ్చిన ఆదివాసీలు

By

Published : Aug 25, 2019, 11:22 AM IST

Updated : Sep 28, 2019, 4:57 AM IST

'అమెజాన్' సంరక్షణకు ముందుకొచ్చిన ఆదివాసీలు

అమెజాన్ అడవులను రక్షించుకుంటామంటూ బ్రెజిల్​లోని జింగ్ ప్రాంత ఆదివాసీలు ముందుకు వచ్చారు. ప్రపంచ ప్రజలు తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. అడవుల నరికివేత, అక్రమ మైనింగ్ చేయకూడదని డిమాండ్​ చేస్తున్నారు. స్వచ్ఛమైన నదీ జలాల్లో పురుగు మందులు కలవకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు.

"భవిష్యత్​లో ఏం జరుగుతుందోననే భయంతో ప్రపంచమంతా అమెజాన్ గురించి ప్రార్థనలు చేస్తోంది. ఈ విపత్కర సమయంలో జింగ్, నదీతీర ప్రజలందరం ఓ చోట చేరాం. మేమంతా కలిసి అమెజాన్ అరణ్యాలను కాపాడాలని నిశ్చయించుకున్నాం. జీవనం కోసం, ఉత్పత్తుల కోసం మేము అరణ్యాలను నాశనం చేయడంలేదు. మా బిడ్డలు, మనవళ్ల కోసం, భూమాత భవిష్యత్​ కోసం వాటిని మేము రక్షించుకుంటున్నాం."
- ఓ ఇ కయాపో, జింగ్ ప్రాంత ప్రతినిధి

బ్రెజిల్​ కార్చిచ్చు

అమెజాన్​ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తూనే ఉంది. మూగజీవాలు... ఆవాసాన్ని, ప్రాణాలను కోల్పోతున్నాయి. దావానలాన్ని అదుపుచేయాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోపై అంతర్జాతీయంగా, దేశీయంగా ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మంటలను అదుపుచేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపారు.

సమస్య తీవ్రత దృష్ట్యా కార్చిచ్చు నివారణ చర్యల గురించి జీ-7 శిఖరాగ్ర సదస్సులో అగ్రదేశాలు చర్చించనున్నాయి.

ఇదీ చూడండి: జీ-7: మోదీ-ట్రంప్​ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?

Last Updated : Sep 28, 2019, 4:57 AM IST

ABOUT THE AUTHOR

...view details