తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో మంచు తుపాను బీభత్సం- 50 వాహనాలు ఢీ - అమెరికాలో మంచు తుపాను బీభత్సం

అమెరికాలోని పలు ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా దులుత్​, సుపీరియర్​ విస్కాన్సిన్​ ప్రాంతాలు 20 అంగుళాల మంచులోనే కూరుకుపోయాయి. తుపాను ప్రభావంతో అయోవా ఇంటర్​స్టేట్​ 80 రహదారిలో సుమారు 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

snowstorm
అమెరికాలో మంచు తుపాను బీభత్సం

By

Published : Dec 10, 2019, 11:36 AM IST

Updated : Dec 10, 2019, 4:40 PM IST

అమెరికాలో మంచు తుపాను బీభత్సం

అమెరికాలోని అయోవా రాష్ట్రాన్ని మంచు తుపాను వణికిస్తోంది. గత వారం రోజుల నుంచి కురుస్తోన్న మంచు కారణంగా తీరప్రాంత నగరాలైన దులుత్​, సురీరియన్​ విస్కాన్సిన్​లు సుమారు 20 అంగుళాల మంచులో కూరుకుపోయాయి. మంచును తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.

శీతాకాల తుపాను హెచ్చరికలు..

మంచు తుపాను కారణంగో సుపీరియర్​ సరస్సు పరిసరాల్లో సుమారు 10 అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది శీతాకాలపు తుపాను విభాగం. ఈశాన్య మిన్నెసోటా, ఈశాన్య విస్కాన్సిన్​ ప్రాంతాల్లో శీతాకాల తుపాను హెచ్చరికలు జారీ చేసింది అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం. ఉత్తర డకోటాలోని ఫార్గోలో అత్యధిక ఉష్ణోగ్రతలు మైనస్​ డిగ్రీలోనే ఉంటాయని అంచనా వేస్తున్నారు నిపుణులు.

50 వాహనాలు ఢీ..

మంచు తుపాను ప్రభావంతో సోమవారం ఉదయం అయోవా రాష్ట్రంలోని ఇంటర్​స్టేట్​ 80 రహదారిలో సుమారు 50 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. హిమపాతంతో దారి కనిపించక ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాల కారణంగా రహదారిని మూసివేశారు అధికారులు.

ఇదీ చూడండి: పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!

Last Updated : Dec 10, 2019, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details