తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాకు వెళ్తే 14రోజులు అలా చేయడం తప్పనిసరి - corona virus in Australia

ప్రపంచ దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు ముమ్మరం చేశాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. తమదేశానికి వచ్చేవారు 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉండాలని తెలిపింది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రయాణ ఆంక్షలను మరికొన్ని దేశాలకు వర్తింపజేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.

Australia to isolate all international arrivals to tackle virus
ఆస్ట్రేలియాలో ప్రయాణికులకు స్వీయ నిర్బంధం

By

Published : Mar 15, 2020, 11:14 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు ఈ చర్యలు తప్పవని ఆదేశ ప్రధాని స్కాట్​ మోరిసన్​ చెప్పారు.

అమెరికా ఆంక్షల విస్తరణ..

ఇప్పటికే పలు ఐరోపా దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధించిన అమెరికా.. ఇప్పుడు బ్రిటన్​, ఐర్లాండ్​ దేశాలకూ వర్తింపజేసింది. కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం డొనాల్డ్​ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్​ పెన్స్​ తెలిపారు. అగ్రరాజ్యంలో కరోనాతో 55మంది మరణించగా, 2500మందికి వైరస్​ సోకినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:కరోనాపై పోరుకు నేడు సార్క్‌ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్‌

ABOUT THE AUTHOR

...view details