తెలంగాణ

telangana

ETV Bharat / international

క్యాపిటల్‌పై మరో దాడికి యత్నం! - క్యాపిటల్ హిల్

అమెరికా క్యాపిటల్​ భవనంపై మరోసారి దాడి చేసేందుకు ఉగ్రముఠాలు పన్నాగం పన్నుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Attempt to attack Capital Hill!
క్యాపిటల్‌పై మరో దాడికి యత్నం!

By

Published : Mar 5, 2021, 7:03 AM IST

అమెరికా చట్టసభల నిలయమైన 'క్యాపిటల్‌' భవనంపై దాడి చేయడానికి తీవ్రవాద ముఠాలు ప్రయత్నిస్తున్నట్టు గురువారం సమాచారం అందుకున్న అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించాయి. మార్చి నాలుగో తేదీనే ఈ దాడి జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. ఇందుకు కారణం లేకపోలేదు. 1933 వరకు మార్చి 4నే అమెరికా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసేవారు. తరువాత అది జనవరి 20కి మారింది.

ఇదీ చూడండి:'ట్రంప్ ఆదేశాలతోనే క్యాపిటల్​పై దాడి చేశాం'

పాత సంప్రదాయాన్ని పురస్కరించుకొని డొనాల్డ్‌ ట్రంప్‌ వేలాది మందితో వస్తారని, అధికారాన్ని చేజిక్కించుకుంటారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందింది. జనవరి ఆరో తేదీన క్యాపిటల్‌పై జరిగిన దాడిలో త్రీ పర్సెంటర్స్‌ అనే తీవ్రవాద సంస్థ పాల్గొందని, అదే మళ్లీ వస్తుందన్న సమాచారం కూడా అందింది.

ఇదీ చూడండి:విశ్వాస పరీక్షకు సిద్ధం: పాక్ ప్రధాని

ABOUT THE AUTHOR

...view details