కళ ఏదైనా.. ఆట ఏదైనా.. ఉత్సవమైనా.. కార్యక్రమమైనా... విభిన్నంగా, భారీ స్థాయిలో ఏది నిర్వహించినా.. దానికి గిన్నిస్ రికార్డు దాసోహం కావాల్సిందే! కాదేదీ గిన్నిస్ రికార్డుకు (Guinness World Records) అనర్హం అన్నట్టు.. కొత్త రికార్డులు ఏది నమోదైనా మనకు గిన్నిస్ పేరు వినిపిస్తుంటుంది.
అలాంటి గిన్నిస్ రికార్డులను (Guinness World Records Day 2021) సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక రోజంటూ ఉంటుందని తెలుసా? అవును.. నవంబర్ 18న వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్ డే (Guinness World Records Day 2021) నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలువురు అథ్లెట్లు సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Guinness World Records 2021) తాజా సంచికలో ఈ రికార్డులన్నీ పొందుపర్చనున్నారు.
6 మీటర్ల దూరం బ్యాక్ ఫ్లిప్...
బ్రిటన్‌కు చెందిన జిమ్నాస్ట్ (Gymnastics Guinness World Records) ఆష్లే వాట్సన్.. సమానంగా ఉంచిన రెండు పోల్స్ నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉన్న మరో పోల్స్ వరకు బ్యాక్ ఫ్లిప్ చేసి.. కొత్త రికార్డు నెలకొల్పారు. ఇందుకోసం కఠినంగా శిక్షణ పొందారు. పట్టుదలతో ప్రయత్నిస్తే గిన్నిస్ సాధించడం కష్టమేమీ కాదని ఇతరులకు చెబుతున్నారు.
ఫుట్‌బాల్‌తో
అమెరికాకు చెందిన లారా బియోండో ఫుట్‌బాల్‌ను (Guinness Football records) ఒంటికాలితో నియంత్రిస్తూ రెండు రికార్డులను దక్కించుకున్నారు. నిమిషంలో అత్యధిక సార్లు కాలిని బంతి చుట్టూ తిప్పి ఓ రికార్డు సాధించిన బియోండో.. కూర్చొని ఎక్కువసార్లు ఫుట్‌బాల్ క్రాసోవర్లు చేసిన మహిళగానూ రికార్డుకెక్కారు.