తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్విట్టర్ నయా రూల్స్​ ​.. బైడెన్​కు తగ్గనున్న ఫాలోవర్స్​!

సామాజిక మాధ్యమాల్లో మనం అనుసరించే ఖాతాలను మళ్లీ కొత్తగా అనుసరించాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఏ యూజర్​కైనా అసహనం కలుగుతుంది కదా! బుధవారం ఇదే పరిస్థితి ఎదురుకాబోతుంది. అమెరికా పాలకులకు చెందిన పోటస్​ ఖాతాలను మళ్లీ కొత్తగా ఫాలో అవ్వాల్సి వస్తోంది. ఇలా ఎందుకు జరగనుంది అంటే..

@POTUS resets as Twitter juggles presidential accounts
ట్విట్టర్ నయా రూల్స్​ ​.. బైడెన్​కు తగ్గనున్న ఫాలోయర్స్​!

By

Published : Jan 20, 2021, 2:55 PM IST

అమెరికా 46 వ అధ్యక్షుడిగా జోబైడెన్​ మరి కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే సామాజిక మాధ్యమం ట్విట్టర్​లోని​ అగ్రరాజ్య పాలకవర్గానికి చెందిన పోటస్​ సంబంధిత ఖాతాలను డొనాల్డ్​ ట్రంప్​ నుంచి జో బైడెన్​కు బదిలీ కానున్నాయి. అయితే.. ఆ ఖాతాలకు ఉన్న లక్షలాది ఫాలోవర్లు(అనుచరులు) మాత్రం ఈసారి యథాతథంగా కొత్త పాలకవర్గాన్ని అనుసరించలేరు. ఎందుకంటే ట్విట్టర్​ ఈసారి కొత్త నియమాలు తీసుకువచ్చింది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

  • @POTUS​, @whitehouse​, @FLOTUS​ ఖాతాలకు ఈసారి ఫాలోవర్ల కొరత సమస్య ఎదురవనుంది.
  • POTUS​ అంటే.. అమెరికా అధ్యక్షుడికి సంక్షిప్త రూపం. FLOTUS​ అంటే అమెరికా తొలిమహిళ అని అర్థం.
  • ట్విట్టర్​లోని ఈ ఖాతాలన్నీ ఏ ఒక్క వ్యక్తికీ శాశ్వతంగా ఉండవు. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ ఖాతాలూ మారుతూ ఉంటాయి.
  • గతంలో అధ్యక్షుడిగా ఒబామా పదవీ కాలం ముగిసినప్పుడు ఆయన @POTUS​ ఖాతాకు ఉన్న ఫాలోవర్లు ఉన్నది ఉన్నట్లుగా ట్రంప్​కు వచ్చి చేరారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదని తెలుస్తోంది.

నోటిఫికేషన్లు వస్తాయి..

అంతకుముందు నుంచి పోటస్​ సంబంధిత ఖాతాలను అనుసరిస్తున్న వారితో పాటు, ఎవరైతే.. ఇప్పుడు జో బైడెన్​, కమలా హారిస్​ ఖాతాలను అనుసరిస్తున్నారో వారికి నోటిఫికేషన్లు చేరుతాయి. దాని ఆధారంగా వారు పోటస్​ ఖాతాలను అనుసరించాలో లేదో నిర్ణయం తీసుకుంటారు. బైడెన్​ ప్రస్తుతం వినియోగిస్తున్న @PresElectBiden ఖాతా @POTUS గా మారిపోతుంది. అయితే.. ఇలా ఫాలోవర్లను ఉన్నది ఉన్నట్లుగా చేర్చకపోవడంపై బైడెన్​ బృందం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్ణయం వారిదే..

ట్విట్టర్​ మాత్రం యూజర్లకు తమకు నచ్చిన వారిని ఫాలో అవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని కల్పించామని చెబుతోంది. విదేశాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని ట్విట్టర్​ ప్రితినిధి నిక్​ పాసిలో తెలిపారు.

ట్రంప్​కు చెందిన @POTUS ​ ఖాతా ఇకపై @POTUS45 గా మారనుంది. అంతకుముందు ఒబామా పదవీకాలం ముగిసిన అనంతరం.. ఆయన వినియోగించిన ఖాతాను POTUS44 గా మార్చేసింది ట్విట్టర్​. ఫేస్​బుక్​లో​ మాత్రం పోటస్​ సంబంధిత ఖాతాలకు చెందిన అనుచరులు యథాతథంగా ఉండనున్నారు. ఫేస్​బుక్​లో అధికారిక వైట్​ హౌస్ అధికారిక​ ఖాతాకు 11 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు.

ట్రంప్​నకు చెందిన పోటస్​, ఆ సంబంధిత సామాజిక మాధ్యమ ఖాతాలు ఇటీవల పూర్తిగా నిషేధానికి గురికాగా.. బైడెన్​కు కొత్త ఖాతాలు రానున్నాయి.

ఇదీ చూడండి:ట్రంప్​కు ఫేస్​బుక్, ట్విట్టర్ వరుస షాకులు

ABOUT THE AUTHOR

...view details