తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్థాన్​.. పర్యవేక్షణ అవసరం' - ఉగ్రవాదం

పాకిస్థాన్​ కేంద్రంగా ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నట్లు తెలిపారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(kamala harris news)​. ప్రధాని మోదీతో భేటీ(Modi Us Visit 2021) సందర్భంగా పాక్​లో ఉగ్రవాదంపై(terrorism news) లేవనెత్తారు. ఉగ్రవాదులకు పాక్​ మద్దతును నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Harris refers to Pak terror role
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

By

Published : Sep 24, 2021, 7:45 AM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ(Modi Us Visit 2021) సందర్భంగా.. ఉగ్రవాదంలో పాకిస్థాన్​ పాత్రను ప్రస్తావించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(kamala harris news)​. ఉగ్రవాద ముఠాలకు(terrorism news) ఇస్లామాబాద్​ మద్దతు, సాయంపై నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ భేటీలో చర్చించిన అంశాలను వెల్లడించారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్​ ష్రింగ్లా.

" ఉగ్రవాదం అంశం చర్చకు వచ్చినప్పుడు.. పాకిస్థాన్​ పాత్రను సుమోటోగా లేవనెత్తారు కమలా హారిస్​. పాక్​లో ఉగ్రవాద ముఠాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ముష్కర మూకలు అమెరికా, భారత్​ భద్రతకు ముప్పుగా మారకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్​కు సూచించారు. సరిహద్దు ఉగ్రవాదం, దశాబ్దాలుగా భారత్​పై తీవ్ర ప్రభావం చూపుతోందన్న మోదీ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని, ముష్కరులకు పాక్​ మద్దతును పర్యవేక్షించాల్సిన ఉవసరం ఉందన్నారు. అలాగే.. కొవిడ్​-19, పర్యావరణ మార్పులు, సైబర్​ సెక్యూరిటీ, అంతరిక్షం సహా కీలక రంగాల్లో సాంకేతిక భాగస్వామ్యంపై చర్చించారు. "

- హర్షవర్ధన్​ ష్రింగ్లా, విదేశాంగ శాఖ కార్యదర్శి.

ఇండో పసిఫిక్​లో శాంతిపై పునరుద్ఘాటన..

మోదీ, కమలా హారిస్​ భేటీలో(PM Modi in US).. అఫ్గానిస్థాన్​ సహా తాజా అంతర్జాతీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు ష్రింగ్లా. ఇండో పసిఫిక్​ ప్రాంతంలో(indo pacific news) శాంతి, స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారని తెలిపారు. కొవిడ్​ మహమ్మారి రెండో దశ నుంచి భారత్​ వేగంగా కోలుకుందని కమలా హారస్ చెప్పినట్లు వెల్లడించారు ష్రింగ్లా.

ఇరు దేశాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్​ పంపిణీ, అత్యవరమైన ఔషధాల, ఆరోగ్య పరికరాల సరఫరా వంటి విషయాలపై మోదీ, హారిస్​ చర్చించారు. పర్యావరణ మార్పులపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా భారత్​ తీసుకుంటున్న చర్యలను హారిస్​కు వివరించారు మోదీ. పునరుత్పాదక ఇంధనానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని, జాతీయ హైడ్రోజన్​ మిషన్​ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:Modi Us Visit 2021: 'కమలా హారిస్ ఎంతో మందికి స్ఫూర్తి'

జపాన్ ప్రధానితో మోదీ భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ

ABOUT THE AUTHOR

...view details