తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు- ఒకరు మృతి - HEAVY RAINS IN BRAZIL

బ్రెజిల్​ రియో డీ జనీరోలో కురుస్తున్న వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వానల కారణంగా ఇప్పటికే ఒకరు మరణించారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

At least one person died, and hundreds were affected by heavy rains in Rio de Janeiro on Sunday
బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

By

Published : Mar 2, 2020, 2:03 PM IST

Updated : Mar 3, 2020, 3:59 AM IST

బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు

బ్రెజిల్ రియో డీ జనీరో​ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నగరంలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

వరదల కారణంగా పేరుకుపోయిన మట్టిని, వ్యర్థాలను తొలగించేందుకు భారీ యంత్రాలను అధికారులు వినియోగిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో సహయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

జనవరిలో 80 మంది మృతి

ఈ ఏడాదిలో జనవరిలో ఆగ్నేయ బ్రెజిల్​ను సైతం వానలు ముంచెత్తాయి. ఆ వరదల కారణంగా 80 మందికి పైగా మృత్యువాతపడినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి:తీరుమారని కిమ్.. మరోసారి ఆయుధ పరీక్షలు!

Last Updated : Mar 3, 2020, 3:59 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details