మెక్సికోలో మాదకద్రవ్యాల ముఠా దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ మారుమూల దారిలో వెళ్తున్న మూడు ఎస్యూవీ వాహనాలపై ఆకస్మికంగా దాడి చేసిన దుండగులు ఓ వాహనాన్ని పూర్తిగా తగలబెట్టారు. తుపాకి గుండు తగిలే వాహనంలో పేలుడు సంభవించిదని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఆరు నెలల కవలలు సహా మొత్తం ఆరుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతిచెందిన వారందరూ అమెరికా పౌరులేనని అధికారులు వెల్లడించారు.
ప్రత్యర్థులు తమపై దాడిచేస్తున్నారని భావించే.. వాహనాలపై దుండగులు దాడి చేసి ఉంటారని మెక్సికో భద్రతా కార్యదర్శి అల్ఫొంసో డురాజో అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారని చెప్పిన ఆయన... వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఆచూకీ కోల్పోయిన ఓ చిన్నారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
సాయానికి సిద్ధం.. అమెరికా