తెలంగాణ

telangana

ETV Bharat / international

బస్సు ప్రమాదంలో 27 మంది దుర్మరణం - అయాకుచోలో బస్సు బోల్తా

250 మీటర్ల లోయలో బస్సు పడి.. 27 మంది మరణించిన ఘటన దక్షిణ పెరూలో జరిగింది. పలువురు గాయపడ్డారు.

bus accident
బస్సు ప్రమాదం

By

Published : Jun 19, 2021, 9:31 AM IST

Updated : Jun 19, 2021, 11:43 AM IST

దక్షిణ పెరూలోని అయాకుచోలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నాస్కాలోని ఆస్పత్రికి తరలించారు. బస్సులో చిన్న పిల్లలతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు.

బస్సు ప్రమాదం
బోల్తా కొట్టిన బస్​ ఇదే

అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. బస్సు 250 మీటర్ల లోయలో పడింది. అయాకుచో ప్రాంతం నుంచి అరెక్విపా వెళ్తుండగా ఇంటర్‌సోనిక్ హైవేపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది

ఇదీ చూడండి:కాల్పుల కలకలం- ఒకరు మృతి, 12 మందికి గాయాలు

Last Updated : Jun 19, 2021, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details